Hyderabad, జూలై 9 -- జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. శని న్యాయదేవుడు. శని తిరోగమనం చెందినప్పుడు, అదే అన్ని రాశుల వారి జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకువస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూలై 13న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. అదే రోజు చంద్రుడు రాహువు ఉన్న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని చంద్రులు కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుంది.

ఈ ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాలపై పడుతుంది. ఈ గ్రహణ యోగం, శని తిరోగమనం ఏ రాశుల వారికి సవాలుగా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారికి శని తిరోగమనం వలన ఏర్పడే గ్రహణ యోగం సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక ఒత్తిడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగ...