Hyderabad, సెప్టెంబర్ 3 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా రెండు గ్రహాలు 108 డిగ్రీలలో ఉన్నప్పుడు దానిని త్రిదశాంశ యోగం అని అంటారు. అయితే శని, గురువు ఇప్పుడు ఈ శక్తివంతమైన యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రెండు గ్రహాల ప్రభావం ద్వారా పై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను అందుకుంటారు.

శని మనం చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు ఎదురవుతాయి. చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలు తప్పవు. శని నవంబర్ వరకు తిరుగమనంలోనే ఉంటాడు. గురువు, శని రెండు గ్రహాలు 108 డిగ్రీలలో ఉండడంతో ఈ త్రిదశాంశ యోగం ఏర్పడుతుంది.

ఈ యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తోంది. కానీ మూడు రాశు...