Hyderabad, ఆగస్టు 25 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. బుధుడు శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. త్వరలోనే భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 15న బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు.

బుధుడు మాట, తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. భద్ర మహాపురుష రాజయోగం మూడు రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఉద్యోగం వస్తుంది. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. మరి బుధుడి రాజయోగంతో ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది? ఎవరు ఎలాంటి లాభాలను...