భారతదేశం, డిసెంబర్ 16 -- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్, రాయికుంట గ్రామంలో 100 పడకల ESIC ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా.మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ESIC కేంద్ర కార్యాలయంలో ఇటీవల 197వ సమావేశం జరిగింది. శంషాబాద్ లో 100 పడకల ESIC ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈఎస్ఐ ఇన్స్యూరెన్స్ కలిగి ఉన్న కార్మికులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలను అందజేస్తోంది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రులు నాచారం, రామచంద్రాపురం, సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్ ప్రాంతాలలో కార్మికులకు వైద్య సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం శంషాబాద్ లో ఏర్పాటు చేయనున్న 100 పడకల ఈఎస్ఐసీ ఆ...