భారతదేశం, మే 17 -- కొరియోగ్రాఫ‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌ల మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. త‌ల మూవీలో అమ్మ రాజ‌శేఖ‌ర్ త‌న‌యుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా న‌టించాడు. ఈ తెలుగు మూవీలో సీనియ‌ర్ హీరో రోహిత్‌తో పాటు ఇంద్ర‌జ‌, ఎస్తేర్ నోరాన్హా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

మద‌ర్ సెంటిమెంట్‌కు యాక్ష‌న్ అంశాలు జోడించి అమ్మ రాజ‌శేఖ‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజైంది. మూడు నెల‌ల్లోనే ఈ మూవీ యూట్యూబ్‌లోకి వ‌చ్చింది. వ‌య‌లెన్స్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తూ రూపొందిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

రాంబాబుకు (రాగిన్ రాజ్‌) అమ్మ త‌ప్ప ప్ర‌పంచంలో నా అనే వాళ్లు ఎవ‌రు ఉండ‌రు. త‌...