భారతదేశం, జూలై 23 -- వ్యాయామానికి ముందు త్వరగా ఏదైనా తినాలనుకుంటే, చాలామందికి అరటిపండే గుర్తొస్తుంది. అదెంతో తేలికగా దొరుకుతుంది. పోషకాలతో నిండి ఉంటుంది. వ్యాయామం చేయడానికి ముందు కావాల్సిన శక్తిని అరటిపండు అందిస్తుంది. పొటాషియం, సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే అరటిపండు వ్యాయామానికి ఇంధనంలా పనిచేస్తుంది. వ్యాయామం తర్వాత కండరాలు తిరిగి కోలుకోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

అయితే, వ్యాయామానికి ముందు అరటిపండు నిజంగానే మంచిదా? ప్రతిరోజూ దీనిపై ఆధారపడొచ్చా? ఈ గందరగోళాన్ని నివృత్తి చేయడానికి ఒక పోషకాహార నిపుణురాలిని అడిగాం. వ్యాయామానికి ముందు అరటిపండు ఆరోగ్యకరమైనదేనని, అనేక ప్రయోజనాలను అందిస్తుందని, కానీ ఇదొక్కటే మీ ప్రీ-వర్కౌట్ ఆహారంలో ఒకే ఒక్క ఎంపిక కాదని ఆమె స్పష్టం చేశారు.

వ్యాయామానికి ముందు చిరుతిండిగా అరటిపండు...