Hyderabad, ఏప్రిల్ 21 -- మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి రెండు సింపుల్ మార్గాలు ఉన్నాయి. ఒకటి సరైన ఆహారం, రెండోది కొద్దిగా వ్యాయామం. కానీ నేటి జీవనశైలిలో ఈ రెండూ కష్టమైన పనులనే చెప్పుకోవాలి. చాలా మంది తమ ఆహారం విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు, కానీ వ్యాయామం విషయానికొచ్చే సరికి సమయం లేక చేయలేకపోతున్నారు.

ఎనిమిది నుండి తొమ్మిది గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం, ఆ తర్వాత అలసిపోయి నిద్రపోవడం అంతే ఇప్పుడు చాలా మంది జీవనశైలి ఇలాగే ఉంది. ఇలాంటి సందర్భంలో ఫిట్‌నెస్ గురించి శ్రద్ధ వహించడం కష్టంతో కూడిన పని అనడంలో తప్పేం లేదు. పనితో రాజీ పడే రోజులు కావు ఇవి.

అలాగని ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించకపోవడం, సమయం కేటాయించకపోవడం పొరపాటని మీరు తెలుసుకోవాలి. వ్యాయామం చేయడానికి సమయం లేకపోయినా మీ రోజూవారి పనులు చేసే సమయంలో చిన్న చిన్న చిట్క...