Hyderabad, జూలై 3 -- నల్లవాడ గ్రామం ఉదయగిరికి సమీపంలో దుత్తలూరు మండలంలో నల్లవాడ వద్ద ఉన్న వెంగమాంబ ఆలయం వుంది. మహా మహిమలకు కొలువై లక్షలాది భక్తులకు అభిష్ట సిద్ధిని కలిగిస్తోంది. 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయలు దక్షిణదేశాన్ని పాలించే రోజుల్లో వెంగమాంబ, పచ్చవ మగమనాయుడు-సాయమ్మ పుణ్య దంపతులకు రేణుకాదేవి (పార్వతి) అనుగ్రహంతోనితిపై పుణ్య సువాసనలు గుబాళించి తాను త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ గౌరీ, శ్రీ దాక్షాయణి, శ్రీ సతీదేవి, శ్రీ దుర్గాదేవి అంశలతో అన్పించిన మహాదేవతగా తన మహిమలను భక్తులకు చూపించిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అందరూ సమానమే, కులాల హెచ్చుతగ్గులు ఎంత మాత్రమూ తగవని ఆ తల్లి అందరికీ తెలియజెప్పింది. ఆనాటి కులాల్లో ఉన్న అసమానతలు, అమ్మృశ్యాది దోషాలను ఆమె పరిష్కరించేది. ప్రజలు న...