భారతదేశం, జనవరి 4 -- హీరో త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు.

అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం అందించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్‌ను ఇవాళ (జనవరి 4) గ్రాండ్‌గా లాంచ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. వ్యవసాయం, ప్రకృతి వంటి అంశాలపై ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

టీజర్‌లో విజువల్స్, మ్యూజిక్, డైలాగ్స్ బాగున్నాయి. 'వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం మారుతుంది' వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఈవ...