Hyderabad, జూలై 14 -- డ్యాన్సింగ్ క్వీన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటిపుల్ హీరోయిన్. శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా ఈ జూనియర్.

సీనియర్ హీరోయిన్ జెనీలియా ఇందులో కీలక పాత్ర పోషించింది. జూనియర్ సినిమాకు రాధ కృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి జూనియర్ సినిమాను నిర్మించారు. అయితే, జూనియర్ మూవీ సాంగ్స్ చార్ట్‌ బస్టర్‌ హిట్ అయ్యాయి. ముఖ్యంగా వైరల్ వయ్యారి అనే పాట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది.

జూనియర్ టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూనియర్ సినిమా జూలై 18న థియేటర్లలో రిలీజ్...