భారతదేశం, జూలై 17 -- వైరల్ వయ్యారి.. ఇప్పుడు చిన్నవాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తున్న పాపులర్ సాంగ్ ఇది. జూనియర్ మూవీలోని ఈ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్, సోషల్ మీడియా ఇలా ఎక్కడైనా ఈ సాంగ్ రీల్స్, షార్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వైరల్ సాంగ్ కు ఓ బామ్మ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జూనియర్ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ జూలై 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూలై 16) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ప్రారంభంలోనే బామ్మ వైరల్ డ్యాన్స్ చేసింది.

జూనియర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో బామ్మ చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. యాం...