భారతదేశం, ఆగస్టు 5 -- న్యూఢిల్లీ: తెలంగాణలో వైద్య కళాశాలల ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నివాస అర్హత నిబంధనను రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం 2017లో రూపొందించి, 2024లో సవరించిన 'తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్' ప్రకారం.. రాష్ట్రంలో 12వ తరగతి వరకు చివరి నాలుగేళ్లు చదువుకున్న విద్యార్థులకు మాత్రమే రాష్ట్ర కోటా కింద వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. అయితే, ఈ నిబంధనను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. కేవలం కొంతకాలం రాష్ట్రం వెలుపల ఉన్నందువల్ల శాశ్వత నివాసితులకు ప్రవేశాల్లో ప్రయోజనాలను తిరస్కరించలేరని హైకోర్టు పేర్కొంది.

మంగళవారం, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. ...