Hyderabad, మే 21 -- కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో ఏకంగా 38 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ థగ్ లైఫ్. ఇందులో త్రిష ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది. తాజాగా ఆమెపై చిత్రీకరించిన షుగర్ బేబీ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో త్రిష ఓ వైట్ శారీలో చాలా సెక్సీగా కనిపించింది.

థగ్ లైఫ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ షుగర్ బేబీ సాంగ్ బుధవారం (మే 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటపై త్రిష వేసిన స్టెప్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ పాటను తెలుగులో అనంత శ్రీరామ్ రాశాడు.

అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఈ సాంగ్ పాడారు. ఏం కావాలి నీకు.. కొద్ది కొద్దిగడుగు అంటూ సాగే ఈ సాంగ్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటల్లో భిన్నంగా ఉందని చెప్పొచ్చు. త్రిష కృష్ణన్ మెస్మరైజింగ్ బ్యూటీతో కనువిందు చేసింది. ఆమె లుక్స్, గ్రేస్.. అన్నీ కలిస...