భారతదేశం, డిసెంబర్ 6 -- బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ లెక్కలేనన్ని వికెట్లను సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ శనివారం (డిసెంబర్ 6) వైజాగ్ లో అతనికి ఒక కొత్త డాన్స్ పార్టనర్ దొరికాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడవ వన్డేలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పెల్ పూర్తి చేసినప్పుడు, కోహ్లీ ఈ లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్-స్పిన్నర్ ను ఒక 'మాక్ స్లో-డాన్స్' లోకి లాగి, అతని చేతిని పట్టుకుని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

గ్రౌండ్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కోహ్లి ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాడు. ఆడియన్స్ కు బోర్ కొట్టనివ్వడు. శనివారం కూడా వైజాగ్ లో అదే చేశాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో కుల్‌దీప్‌ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. చివర్లో ఒకే ఓవర్లో కార్బిన్ బాష్, ఎంగిడి వికెట్లు తీశాడు. అప్పుడు కోహ్లి వచ్చి కుల్‌దీప్‌ను హత...