భారతదేశం, జనవరి 27 -- జనవరి 28 బుధవారం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా Vs న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి వైజాగ్ సిటీ సిద్ధమైంది. దాదాపు 28,000 మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా. ఈ మ్యాచ్ సజావుగా జరిగేలా అధికారులు ట్రాఫిక్, పార్కింగ్ ప్రణాళికలతో ఏర్పాట్లను చేశారు. 2026 ఏడాదిలో నగరంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ చివరి అంతర్జాతీయ మ్యాచ్ డిసెంబర్ 6, 2025 భారతదేశం-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది.

సోమవారం సాయంత్రం రెండు జట్లు నగరానికి చేరుకుని మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లు నిర్వహించాయి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ డోంగ్రే పర్యవేక్షణలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పిచ్ తయారీ, ప్రేక్షకుల సౌకర్యాలతో సహా అన్ని ఏర్పాట్లను ...