భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వహించ‌నున్న ప్రతిష్టాత్మక‌ వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వచ్చే భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో ఆదివారం సాయంత్రం వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు డిప్యూటేష‌న్ విధుల‌కు వచ్చిన టీటీడీ ఉద్యోగులు, పోలీసుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ఈసారి వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు టోకెన్ల కేటాయింపులో విధానాత్మక మార్పులు తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. వైకుంఠ ద్వార ద‌ర్శన విధుల‌కు వ‌చ్చిన సిబ్బంది వ్యవ‌స్థను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. స‌మ‌న్వయంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా 24 గంట‌లు అప్రమ‌త్తంగా...