భారతదేశం, డిసెంబర్ 15 -- వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టుగా టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. మెుదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా టోకెన్లు కేటాయించామని తెలిపారు. మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.

తిరుమలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాట్లు, సదుపాయాలపై నిరంతరం పర్యవేక్ష ఉంటుందన్నారు. పీఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని చెప్పారు.

'ఆలయ ధ్వజస్తంభాల కోసం వంద ఎకర...