భారతదేశం, నవంబర్ 4 -- వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మెుంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చారు. జగన్ కాన్వాయ్ నియోజకవర్గంలోకి రాగానే వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టాయి. దీంతో ప్రమాద జరిగింది. అయితే పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.
పర్యటనకు ముందే పలు నిబంధలను విధించారు పోలీసులు. వీటిని వైసీపీ శ్రేణులు ఉల్లంఘించాయి. డీజే ఏర్పాటు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు తీయించారు. కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.