భారతదేశం, డిసెంబర్ 21 -- మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో. వైఎస్‌ జగన్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్)‌ వేదికగా శుభాకాంక్షలు పేర్కొన్నారు.

'వైఎస్‌ జగన్‌ గారూ జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

"మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

c

Birthday greetings to former Chief Minister YS Jagan Mohan Reddy. Wishing him good ...