Hyderabad, ఏప్రిల్ 28 -- చారిత్రక నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇప్పుడు అది ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలతో పాటు హైదరాబాద్ చూసేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అక్కడ సందర్శనీయ ప్రాంతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వెళ్లేముందే మీరు ఏ ఏ ప్రాంతాలను చూడాలో ప్లాన్ వేసుకోండి.

హైదరాబాదులో చూడాల్సిన ప్రాంతాల జాబితా ఇక్కడ ఇచ్చాము. మీరు అక్కడ బస చేసే రోజుల సంఖ్యను బట్టి ఏ ఏ ప్రాంతాలను చూడవచ్చు. ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ ప్రాంతాలు చూసే అవకాశం ఉంటుంది.

అనంతగిరి హిల్స్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న అందమైన కొండ ప్రాంతం ఇది. పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లడానికి మంచి ప్రదేశం. ప్రకృతిలో ఆనందంగా కొన్ని గంటల పాటు ఉండాలనుకుంటే అనంతగిరి హిల్స్ కు వెళ్ళండి. మీకు కచ్చితంగా ఇది నచ్చుతుంది.

హైదరాబాద్‌కు చిహ్నం లాంటిది ...