Hyderabad, ఏప్రిల్ 22 -- తీవ్రమైన ఎండ, అధిక ఉష్ణోగ్రతల వేడి నుండి ఉపశమనం పొందడానికి, చల్లని ప్రదేశాలకు వెళ్లడం ఉత్తమం. పిల్లలకు కూడా వేసవి సెలవులు మొదలు కాబోతున్నాయి. సెలవులు ఇచ్చింది మొదలు ఎక్కడికైనా తీసుకెళ్లండి డాడీ, ఏదైనా మంచి ప్లేస్ కి వెళదాం మమ్మీ అని అంటునే ఉంటారు పిల్లలు. వారికే కాదు పెద్దలకు కూడా వేడికి, పని ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా, చల్లగా ఉండే ఏదైనా ప్రదేశాలనికి వెళితే బాగుండు అని అనిపిస్తుంటుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే మీరు మీ కుటుంబాన్ని తీసుకుని మంచి హిల్ స్టేషన్ కు వెళ్లడం ఉత్తమం.

పర్వత ప్రాంతాలు చాలా అందంగా, ప్రశాంతంగా అనిపిస్తాయి. నిత్యం గందరగోళంగా ఉండే నగర జీవితం నుండి కొన్ని రోజులు విరామం తీసుకొని, ప్రశాంతమైన హిల్ స్టేషన్‌లో సమయం గడిపితు మీకు చాలా రిలీఫ్ గా, సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఈ ప్రదేశాలలోని వివి...