Hyderabad, మే 9 -- భానుడు భగభగమంటున్నాడు. వేడికి ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బయట అడుగు పెట్టాలంటేనే భయమేస్తోంది. కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు ముఖ్యమైన పనుల రిత్యా వెళ్లక తప్పడం లేదు. ఇలాంటప్పుడు వేడి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి. అంటే నిండైన దుస్తులు, కళ్లకు అద్దాలు, క్యాప్ స్కార్ప్ వీటన్నింటినీ ధరించాలి. ఇది అందిరికీ తెలిపిన విషయమే. చాలా మందికి తెలియని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనం వేసుకునే దుస్తుల రంగు ద్వారా కూడా మనం వేడి నుంచి తప్పించుకోవచ్చట. ఎండ వేడిని ఎదుర్కోవడానికి ఇదొక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుందట.

అవును వేసవిలో కొన్ని రంగుల దుస్తులు వేసుకోవడం వల్ల శరీరం ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. అలాగే కొన్నింటిని వేసుకోవడం వల్ల వేడి ప్రభావాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అంటే కొన్ని రంగులు సూర్యుడి వేడిని స్పాంజ్‌లా పీల్చుకు...