Hyderabad, ఏప్రిల్ 20 -- ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో, సౌందర్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. అమ్మమ్మలు, నానమ్మలు ఇప్పటికీ తరచుగా చర్మానికి పసుపు వాడమని సూచిస్తారు. ఎందుకంటే ఇది చర్మం లోతుల్లో నుంచి మెరుగుపరిచి ఆరోగ్యకరంగా, అందంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది.పసుపులో శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలు, రంగు మచ్చలు, మొటిమలు వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. వేసవి చర్మ సంరక్షణలో పసుపును అప్లై చేయడం వల్ల కలిగే లాభాలేంటి, దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

పసుపులో ఉన్న కుర్కుమిన్ (Curcumin) ఎండ వేడి కారణంగా కలిగే దుష్పరిణామాలను తగ్గిస్తుంది.సూర్యకాంతి వల్ల వచ్చే టానింగ్, ఎరుపుదనం, దురద వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

చర్మాన్ని చల్లగా ఉం...