Hyderabad, ఏప్రిల్ 23 -- మజ్జిగ తాగడం వల్ల వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. అందరూ హైడ్రేట్‌గా ఉండాల్సిన సమయం ఇది. హైడ్రేషన్ కోసం సరిపడా నీరు త్రాగడం చాలా ముఖ్యం. కానీ రోజంతా నీరు మాత్రమే తాగడం వల్ల ఉపయోగం లేదు.

వేసవిలో హైడ్రేట్‌గా ఉండటానికి నారింజ జ్యూస్, నీళ్ళు, పండ్లు తో పాటు రోజుకు రెండుసార్లు మజ్జిగ కూడా ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగుతో తయారయ్యే మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది నిపుణులు రోజూ ఒక గ్లాసు మజ్జిగ త్రాగమని సలహా ఇస్తారు. వేసవిలో ఆరోగ్యానికి మజ్జిగ.. పెరుగు కంటే మెరుగైనది.

పెరుగుతోనే మజ్జిగ తయారవుతున్నప్పటికీ పెరుగు కన్నా మజ్జిగ ఎందుకు మెరుగైనది అనే సందేహం వచ్చే ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఇచ్చాము.

కొన్ని నివేదికల ప్రకారం పెరుగులో చురుకైన బ్యాక్టీరియా ఉంటాయి. అవి వేడికి గు...