Hyderabad, ఏప్రిల్ 21 -- టీ విషయానికొస్తే, ప్రతిఒక్కరి మైండ్‌లో ఉండేది మసాలా టీ, జింజర్ టీ, గ్రీన్ టీ, హైబిస్కస్ టీ లాంటివి తిరుగుతుంటాయి. కానీ, పైనాపిల్ టీ గురంచి తెలిసిన తర్వాత దీన్ని కూడా మీ లిస్ట్ లోకి చేర్చేసుకుంటారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ టీని పైనాపిల్ తొక్కతో తయారుచేస్తారట. కొన్నిసార్లు పండులోని గుజ్జును కూడా వాడతారు. వాస్తవానికి పైనాపిల్ తోలులో చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సీ లాంటి పోషకాలు శరీరానికి అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పైనాపిల్ తోలులో బ్రోమెలైన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం చేత ఇతర టీల కంటే బెటర్ గా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఈ సమ్మర్ డ్రింక్‌ను కచ్చితంగా తోలుతోనే చేయాలనేం లేదు. పైనాపిల్ లోపలి గుజ్జుతో కూడా తయారుచేసుకోవచ్చు. కానీ, పైనాపిల్ తోలుతో చేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్క...