Hyderabad, ఏప్రిల్ 13 -- బట్టలు ధరించే సమయంలో చాలా ఈజీగా కనిపించే ఆప్షన్ జీన్స్. అది టాప్ అయినా, ప్యాంట్‌గా అయినా ధరించడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మ్యాచింగ్‌కు కూడా పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వేసవికాలం కాస్త కంఫర్ట్ తక్కువగా ఉండొచ్చు. వాస్తవానికి కంఫర్ట్‌యే కాదు, జీన్స్ ధరించడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఈ విషయాలు తెలుసుకోకుండా స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా ఉంటుందని జీన్స్ వాడుతున్న వాళ్లకు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా..

జీన్స్ వేసుకోవడం వల్ల చర్మం లోపలికి గాలి ప్రసారం ఇబ్బందిగా మారుతుంది. ఫలితంగా ప్రైవేట్ పార్ట్స్ ప్రాంతంలో వేడిగా అనిపించి ఉక్కబోతకు గురవుతారు. దీంతో చెమటపట్టి దురద కలుగుతుంది. వేసవికాలం ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండొచ్చు. మగవారిలో ఈ పరిస్థితి స్పెర్మ్ తక్కువ కావడానికి కూడా దారి తీ...