Hyderabad, ఏప్రిల్ 18 -- సమ్మర్ వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? దూర తీర ప్రాంతాలకు వెళితే ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో చల్లని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వేసవిలో కర్ణాటకలో సందర్శించడానికి ఉన్న కూల్ ప్రదేశాల వివరాలు ఇక్కడ ఇచ్చాము. ఒక వారం రోజులు ట్రిప్ వేస్తే మీరు ఈ పది ప్రదేశాలను చూడవచ్చు. లేదా వీటిలో కొన్నింటిని అయినా చూసి రావచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్నవి. అలాగే ఎంతో చల్లగా ఉండి వేసవి తాపాన్ని తీరుస్తాయి.

దీన్ని కొడగు అని కూడా పిలుస్తారు. భారతదేశంలో స్కాట్లాండ్ గా కూర్గ్‌ను పిలుచుకుంటారు. పొగ మంచుతో కూడిన కొండలు, పచ్చదనం, కాఫీ తోటలకు కూర్గ్ ప్రసిద్ధి చెందింది. అక్కడికి వెళితే తిరిగి రావాలనిపించదు. అంత అందంగా ఉంటుంది ఈ ప్రదేశం.

కర్ణాటకలోని మరొక...