భారతదేశం, నవంబర్ 26 -- ఓటీటీలో ఎన్నో సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఇందులో ఎక్కువ వాటా యానిమేటెడ్ సినిమాలదే. ఇందులో 15 వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలున్నాయి.

2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో 'నీ ఝా 2' మూవీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది చైనా యానిమేటెడ్ మూవీ. ఇది ప్రపంచవ్యాప్తంగా 2.13 బిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకుంది. ఇండియా కరెన్సీలో ఇది సుమారు రూ.17,700 కోట్లతో సమానం. నీ ఝా 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

మరో యానిమేటెడ్ మూవీ లైలో అండ్ స్టిచ్ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన వాటిల్లో ఇది సెకండ్...