భారతదేశం, నవంబర్ 25 -- సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. దీంతో స్వదేశంలో దారుణమైన వైట్ వాష్ తప్పేలా లేదు. ఇండియన్ టీమ్ దారుణమైన ప్రదర్శనతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ప్లేయర్స్ ను ఉద్దేశించి గంభీర్ వేలు చూపిస్తూ మాట్లాడటం.. దానికి మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

సౌతాఫ్రికాతో టీమిండియా రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలుసు కదా. మంగళవారం (నవంబర్ 25) నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు గంభీర్ ప్లేయర్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ సమయంలో గతేడాది గంభీర్ ఇచ్చిన ఒక పాత ప్రెస్ కాన్ఫరెన్స్ క్లిప్‌ను బ్రాడ్‌కాస్టర్‌లు ప్లే చేశారు. ఆ క్లిప్‌లో గంభీర్ మాట్లాడుతూ.. "భారత జట్టు ఒక రోజులో 400 పరుగులు చేయడా...