భారతదేశం, డిసెంబర్ 28 -- సస్పెన్స్ కు తెరపడనుంది. తెలుగు ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న పాపులర్ వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతుంది. తెలుగులో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేశారు. దీంతో 'వేర్ ఈజ్ చంద్రిక?' అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతుంది.

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఇదో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ గా ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025 నుంచి ఓటీటీలోకి అందుబాటులో వచ్చింది.

ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ 2 జనవరి 8, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుందని ఈటీవీ విన్ ఓటీటీ ప...