భారతదేశం, జనవరి 21 -- వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. కొన్నిచోట్ల విడిపోవటాలు జరుగుతుండగా. మరికొన్ని వ్యవహారాల్లో ప్రాాణాలే పోతున్నాయి. కట్టుకున్న వారని కూడా చూడకుండా కడతేర్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కూడా ఓ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో నిద్రపోతున్న భర్తను చున్నీతో ఉరేసి హత్య చేశారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

భార్య భర్తలు అయిన సుధీర్ రెడ్డి, ప్రసన్న. కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు మరో వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధం అని తెలిసింది. ఈ విషయాన్ని భర్త గట్టిగా ప్రశ్నించటాన్ని భార్య ప్రసన్న తట్టుకోలేకపోయింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని చూసింది. అయితే భార్య తీరుపై కన్నేసి సుధీర్ రెడ...