భారతదేశం, డిసెంబర్ 28 -- వేములవాడ రాజన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో మొక్కుల చెల్లింపు జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే మేడారం జాతర షురూ కానుంది. అయితే ఈ జాతరకు ముందు భక్తులు వేములవాడ రాజన్నకు కోడె మొక్కులతో పాటు వివిధ ఆర్జిత సేవల మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి భక్తులు భారీగా తరలివస్తూ. మొక్కులు చెల్లించుకుంటున్నారు.

భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో బద్ది పోచమ్మ ఆలయం వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 రోజుల పాటు 24 గంటల పాటు దర్శనాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్ 28) 24 గంటలపాటు తెరిచి ఉంచ...