భారతదేశం, అక్టోబర్ 12 -- వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఆదివారం నుండి భక్తులకు తాత్కాలికంగా దర్శనాలను నిలిపివేశారు. రాజరాజేశ్వర స్వామి మందిరం అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ప్రధాన ఆలయంలో ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఇకపై భీమేశ్వరాలయంలో కోడెమొక్కు, అభిషేకాలు, కుంకుమపూజ, నిత్య కల్యాణం, చండీయాగం వంటి పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారిణి రమాదేవి మాట్లాడుతూ, ఆలయాన్ని మూసివేయడం లేదని స్పష్టం చేశారు. 'పనులు జరుగుతున్న సమయంలో భక్తులు భీమేశ్వరాలయంలో అన్ని పూజలు కొనసాగించవచ్చు.' అని ఆమె పేర్కొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నేతృత్వంలో బీజే...