భారతదేశం, ఏప్రిల్ 18 -- భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 47 కోట్లు మంజూరు చేయడంతోపాటు బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు.

పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎండోమెంట్ ఆర్కిటిక్, స్థపతులు, ఇంజనీరింగ్ అధికారులు వేములవాడ ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఆలయ పునః నిర్మాణపై సమీక్షించారు. ఈనెలాఖరులో శృంగేరి పీకాధిపతుల అనుమతుల కోసం వెళ్ళాలని నిర్ణయించారు. వారి సూచనలతో భక్తిభావం విరాజిల్లేలా జూన్ 15న పనులు చేపట్టాలని ముహూర్త...