భారతదేశం, డిసెంబర్ 17 -- కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికపై ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు కోసం చేసిన విజ్ఞప్తిని విన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిమిషాల వ్యవధిలోనే నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే రహదారి మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. డిప్యూటీ సీఎం నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మంగళవారం కానిస్టేబుళ్లుగా నియామాకం అయిన వారికి పత్రాలు అందజేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరయ్యారు. సభా వేదికపై కానిస్టేబుల్ గా నియమితుడైన గిరిజన యువకుడు లాకే బాబూరావు మాట్లాడుతూ. తన సక్సెస్ స్టోరీ వివరించారు. ఈ క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.

బాబూరావు కోరిక మేరకు అతని గ్రామానికి రోడ్డు వేసే బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి కు అప్పగించారు. ...