భారతదేశం, ఏప్రిల్ 4 -- వేదాంత లిమిటెడ్ కంపెనీ షేరు ధర 9.40 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాల్లో రికార్డు స్థాయిలో జింక్, అల్యూమినియం ఉత్పత్తి జరిగింది. అయితే ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో మార్కెట్ పతనమైన వేళ వేదాంత లిమిటెడ్ షేర్లు కూడా పతనమయ్యాయి.

బీఎస్ఈలో కంపెనీ షేరు రూ. 435.65 వద్ద ప్రారంభమైంది. కంపెనీ షేరు ధర 9.40 శాతం క్షీణించి రూ. 398.20 వద్ద ముగిసింది. కంపెనీ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 301.70గా ఉంది. కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి రూ.527.

అల్యూమినియం, జింక్ ఉత్పత్తి చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుందని కంపెనీ తన బిజినెస్ అప్ డేట్‌లో తెలిపింది. వీటితో పాటు ఇనుప ఖనిజం, ఉక్కు, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అయితే నాలుగో త్రైమాసికంలో ఇది ఒక శాతం పెరిగింది. అల్యూమినియం ఏడాది ప్రాతిపదికన 2 శాతం ...