Hyderabad, ఏప్రిల్ 17 -- వేసవి కాలం సెలవులు, మామిడిపండ్లతో సరదాలను తెచ్చిపెట్టడంతో అనేక రకాల ఇబ్బందులను కూడా తీసుకువస్తుంది. వాటిలో ఒక సాధారణ సమస్య ఆహారం త్వరగా చెడిపోవడం. వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం తయారుచేసిన ఆహారం సాయంత్రానికే చెడిపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే ఆహారాన్ని నిల్వ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫ్రిజ్ ఉన్నప్పటికీ ప్రతిసారీ ఆహారాలను ఫ్రిజ్ లో నిల్వ చేయలేము. ఇది ఆహారం రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తుంది.

ఇలా వండిన ఆహారాలు పాడవడం వల్ల సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. అందుకే చాలా మంది గృహిణులు వేసవిలో ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచుకోవాలో తెలియక ఆందోళన చెందుతారు. మీ ఇంట్లో కూడా ఇదే సమస్య అయితే వండిన ఆహారాలను పడేయడం మీకు బాధగా ఉంటే ఇది కథనం మీ కోసమే. మీ ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచ...