భారతదేశం, ఏప్రిల్ 26 -- క‌న్న‌డ మూవీ సీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ మెడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది.

కిర‌ణ్ సుబ్ర‌మ‌ణి హీరోగా న‌టిస్తూ సీ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీధ‌ర్ రామ్‌, ప్ర‌శాంత్‌, రూపేష్ ఆర్య కీల‌క పాత్ర‌లు పోషించారు. మెడిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8.1 రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది. తండ్రీ కూతుళ్ల అనుబంధం, ఆర్గాన్స్ ట్రాఫికింగ్ అనే అంశాల‌తో సీ మూవీ తెర‌కెక్కింది. గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో ఈ మూవీ క‌న్న‌డంలో థియేట‌ర్ల‌లో రిలీజైంది.

కిర‌ణ్ సుబ్ర‌మ‌ణి ఓ హాస్పిట‌ల్‌లో వార్డ్‌బాయ్‌గా ప‌నిచేస్తుం...