భారతదేశం, డిసెంబర్ 13 -- టాలీవుడ్ యంగ్ హీరో, జిస్మత్ వ్యవస్థాపకుడు ధర్మ మహేష్ డిసెంబర్ 11న గుంటూరులో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ మూడవ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఇది వేగంగా విస్తరిస్తున్న తన ఆహార సంస్థలో మరో ప్రధాన మైలురాయిని సూచిస్తుంది.

గుంటూరులో సాయంత్రం 6 గంటలకు జరిగిన జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ మూడో బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్‌కు వెయ్యి మందికి పైగా భారీ బైక్ ర్యాలీలో పాల్గొని వేదికలోకి ప్రవేశించిన ధర్మ మహేష్‌కు వీరోచిత స్వాగతం పలికారు. అంటే, ఈ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు దాదాపుగా వెయ్యి మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి హాజరయ్యారు హీరో ధర్మ మహేష్.

అయితే, ఈ కార్యక్రమం ధర్మ మహేష్‌‌కు చాలా వ్యక్తిగత, భావోద్వేగ క్షణంగా అభివర్ణించారు. ఎందుకంటే జిస్మత్‌లోని "J" అక్షరం తన కుమారుడు జగద్వాజ పేరు వచ్చేలా డిజైన్ చేశారు. అయితే, ఇంతకుముందు జిస్మత్...