భారతదేశం, నవంబర్ 23 -- దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, నటుడు ప్రభాస్ తమ రాబోయే చిత్రం 'స్పిరిట్' షూటింగ్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఆదివారం (నవంబర్ 23) చిత్ర బృందం సమక్షంలో ముహూర్త వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నిర్మాత భూషణ్ కుమార్, నటి త్రిప్తి డిమ్రి కూడా పాల్గొన్నారు.

స్పిరిట్ టీమ్ అప్ డేట్ ను షేర్ చేసింది. స్పిరిట్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ ముహూర్త వేడుకకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు. ఒక ఫోటోలో భూషణ్ తో కలిసి చిరంజీవి సినిమా క్లాప్‌బోర్డ్‌ను పట్టుకుని కనిపించారు. సందీప్, త్రిప్తి డిమ్రి కూడా వారి పక్కనే నిలబడి కనిపించారు. అయితే, ఫోటోలలో ప్రభాస్ కనిపించకపోవడం గమనార్హం. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కూడా ఫోటోలలో కనిపించలేదు.

స్పిరిట్ ముహూర్తం కార్యక్రమానికి సంబంధించిన ఫొ...