భారతదేశం, మే 29 -- అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా మాస్ ర్యాంపేజ్ తో, వీర లెవల్ యాక్షన్ తో అదరగొట్టారు హీరో నాని. ఆయన అర్జున్ సర్కార్ ఐపీఎస్ గా యాక్ట్ చేసిన 'హిట్ ది థర్డ్ కేస్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసింది. ఈ మూవీలో నాని ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సత్తాచాటారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'హిట్ 3' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'హిట్ 3' ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమ్ అవుతోంది ఈ మూవీ. మే 28 అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే మే 29న ఓటీటీలో అడుగుపెట్టింది హిట్ 3. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 4కే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఆడియోతో ఈ మూవీ ఫ్యాన్స్ కు మంచి ఎక్...