భారతదేశం, సెప్టెంబర్ 4 -- వెయిటింగ్ కు ఎండ్ కార్డు. ప్రభాస్ నుంచి కాజల్ వరకూ ఎంతో మంది స్టార్లు నటించిన మంచు విష్ణు మూవీ 'కన్నప్ప' (Kannappa) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలై ఫర్వాలేదనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (సెప్టెంబర్ 4) ఓటీటీలో రిలీజైంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమా ఓటీటీలోకి గురువారం అడుగుపెట్టింది. కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు నిర్మించారు. తమిళ అందం ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేసింది.

క...