Hyderabad, సెప్టెంబర్ 8 -- దతది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మొదటి నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ ట్రైలర్ గత నెలలో ప్రివ్యూ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు బయటికి వచ్చింది. ఇందులో రాజమౌళితోపాటు ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏడు ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ ఇది. గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సిరీస్ ను నిర్మించింది.

నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18 నుంచి ఈ బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఆస్మాన్ సింగ్ (లక్ష్య) అనే యాక్టర్ చుట్టూ తిరుగుతుంది. అతనితో పాటు నమ్మకమైన బెస్ట్ ఫ్రెండ్ పర్వైజ్ (రాఘవ్ జుయల్), మేనేజర్ సాన్యా (అన్య సింగ్), అతనికి సపోర్ట్ చేసే ఫ్యామిలీలో మామయ్య అవతార్ (మనో...