భారతదేశం, జూలై 12 -- తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ను మరింత పెంచే.. ఇద్దరు అగ్ర రాజకీయ నాయకుల కథతో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథను రిఫరెన్స్ గా తీసుకుని ఈ సీరిస్ ను రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ టీజర్ ను ఈ రోజు (జూలై 12) రిలీజ్ చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్.. సిరీస్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది.

వైఎస్సార్, సీబీఎన్ కథతో తెరకెక్కుతున్న మూవీకి 'మయసభ' అనే టైటిల్ ఖరారు చేశారు. సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. సోనీ లివ్ ఓరిజినల్ సిరీస్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా శనివారం అనౌన్స్ చేశారు. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పాపు...