భారతదేశం, జనవరి 5 -- అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వెనిజులా రాజధాని కరాకస్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత రహస్యంగా సాగిన ఆపరేషన్‌లో అమెరికా కమెండోలు వీరిని 'క్యాప్చర్' చేశారు. 1989లో పనామాపై దాడి తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ నేతకు భారతదేశంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తితో ఒక లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉందన్న విషయం చాలామందికి తెలియదు.

నికోలస్ మదురో పుట్టుకతో క్యాథలిక్ అయినప్పటికీ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ద్వారా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడిగా మారారు. వీరిద్దరూ పెళ్లికి ముందే సాయిబాబా బోధనలకు ప్రభావితులయ్యారు.

2005...