భారతదేశం, జనవరి 9 -- నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శ్రీలంకకి తూర్పు ఈశాన్యందా 160 కి.మీ, పుదిచేరికి ఆగ్నేయంగా 540 కిమీ. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది జనవరి 10వ తేదీన వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర శ్రీలంక తీరాన్ని మధ్యాహ్నం సమయంలో దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక తెలంగాణలో చూస్తే పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే 2 రోజుల్లో అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే సూచనలున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు.

ప్రస్తుతం తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. పలు చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డవుత...