భారతదేశం, జనవరి 6 -- టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న న్యూ ఇయర్ వేడుకల కోసం ఇటలీ వెళ్లి, తాజాగా సోమవారం హైదరాబాద్ తిరిగొచ్చారు. వెళ్లేటప్పుడు ఎవరికి వారు విడివిడిగా వెళ్లినా.. వచ్చేటప్పుడు మాత్రం ఒకేసారి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వీరి ఎయిర్‌పోర్ట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సోమవారం (జనవరి 5) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక సందడి చేశారు. ఇటలీలో కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట, తిరిగి రావడంతో పెళ్లి వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. మీడియా కంటపడకుండా ఉండేందుకు ఇద్దరూ మాస్కులు ధరించి, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.

రష్మిక గ్రే ట్రౌజర్స్, వైట్ హై-నెక్ టీషర్ట్, బ్లాక్ కోట్ వేసుకోగా.. విజయ్ బ్లాక్ ప్యాంట్స్, లెదర్ జాకెట్, బ్లూ క్యాప్‌తో స్టైలిష్‌గా కనిపించాడు. ఫ...