భారతదేశం, డిసెంబర్ 23 -- బంగారం అంటే భారతీయులకు అమితమైన ఇష్టం. కానీ, గత కొంతకాలంగా వెండి ఇస్తున్న రిటర్నులను గమనిస్తే బంగారం కంటే 'వైట్ మెటల్' (వెండి) మిన్న అనిపిస్తోంది. 2025లో వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సరఫరాలో లోపాలు వెండిని సరికొత్త శిఖరాలకు చేర్చాయి.

దీర్ఘకాలిక పెట్టుబడిలో ఉన్న మజా ఏంటో వెండి ధరల విశ్లేషణ చూస్తే అర్థమవుతుంది. 2000 సంవత్సరంలో ఒక ఇన్వెస్టర్ వెండిపై కేవలం రూ. 1,000 పెట్టుబడి పెట్టి, దానిని అలాగే వదిలేసి ఉంటే.. నేడు దాని విలువ అక్షరాలా రూ. 26,455 అయ్యేది. అంటే పాతికేళ్లలో పెట్టుబడి 26 రెట్లు పెరిగిందన్నమాట.

2000 సంవత్సరంలో దేశీయ మార్కెట్లో కేజీ వెండి సగటు ధర సుమారు రూ. 7,900 ఉండగా, నేడు అది ఏకంగా రూ. 2.16 లక్షల మార్కును చేరుకుంది. అంటే దాదాపు 2,600 శాతం లాభం. ఒకప్పుడు వె...