భారతదేశం, జనవరి 28 -- బుధవారం నాటి ట్రేడింగ్‌లో బుల్స్ జూలు విదిల్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న బలమైన సంకేతాలతో శ్వేత లోహం వెండి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కిలో Rs.3.75 లక్షల మార్కును దాటేసింది. కేవలం ఒక్క రోజులోనే 6% మేర ధర పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా డాలర్ విలువ పడిపోవడం, భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా పరిగణించే బంగారం, వెండి వైపు క్యూ కడుతున్నారు.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు సరికొత్త గరిష్ట స్థాయి Rs.3,77,655కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ సిల్వర్ ఒక దశలో 117.69 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే వెండి ధర ఏకంగా 60% మేర పెరగడం విశేషం.

మరోవైపు బంగారం కూడా రికార్డుల వేటను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌...