భారతదేశం, ఆగస్టు 15 -- భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. బంగారం తర్వాత వెండిని విలువైన లోహంగా చాలా మంది చూస్తారు. బంగారంతో పాటు వెండి ఆభరణాలను కూడా ధరిస్తారు. అయితే బంగారం మాదిరిగానే వెండికి కూడా నియమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వెండి ఆభరణాలకూ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయడానికి కొత్త నియమాలు అమలు చేసేలా ప్రణాళికలు చేస్తోంది.

బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ కారణంతో చాలా మంది వెండి వైపు మెుగ్గు చూపిస్తున్నారు. వెండికి డిమాండ్ కూడా పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి. అయితే సెప్టెంబర్ 1, 2025 నుండి కొత్త నియమాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ విధానం సెప్టెంబర్ 1, 2025 నుం...